Subscribe Us

header ads

ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరం సంసిద్ధంగా ఉండాలి

ఆగిరిపల్లి:-

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలోని మడుపల్లి గోపాల్ కళ్యాణ మండపంలో పార్టీ ఆదేశాలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నూజివీడు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి శీను మాట్లాడుతూ జరగబోవు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 2021 జూన్ నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి నిరుద్యోగి తమ ఓటు నమోదు చేసుకోవాలని తెలియజేశారు.

 డిగ్రీ పూర్తయిన ప్రతి వ్యక్తి ఫామ్ 18 పూర్తి చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్ను టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ను ఓటర్ ఐడి కార్డు మరియు ఆధార్ కార్డును జిరాక్స్ లను జత చేసి ఆన్లైన్ చేసిన ఫారాలను ఎటా స్టేషన్ చేయించి ఎమ్మార్వో ఆఫీస్ నందు గాని దూచివేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు గాని ఇవ్వవలసిందిగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆరేపల్లి శ్రీనివాస్ రావు ఆగిరిపల్లి టౌన్ ప్రెసిడెంట్ పామర్తి. నరసింహారావు,తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.