ఆగిరిపల్లి:-
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో గ్రామ సభ, రీ సర్వే కార్యక్రమాన్ని ఎమ్మార్వో పి ఎన్ వి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.ఎమ్మార్వో మాట్లాడుతూ రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని అన్నారు.గ్రామసభ నిర్వహించి రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల వినతులను స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యలను ఎమ్మార్వోకి వినతి రూపంలో అందించగా సత్వరమే పరిష్కారం చేస్తానని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు గ్రామాల్లో ప్రజలకు పాల్గొన్నారు.