Subscribe Us

header ads

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలి

గోకవరం :

 దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా గోకవరంలోని దేవిచౌక్,గద్దెలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ.మహిశాసుర మర్థిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణ కుంభాభిషేకంతో అయనకు స్వాగతం పలికారు. దేవి చౌక్ పురోహితులు జగన్నాథ శర్మ,గద్దెలోని పురోహితులు కుమార్ శర్మ అమ్మవారికి ఎమ్మెల్యే నెహ్రూచే ప్రత్యేక పూజలు జరిపించారు.

 ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే నెహ్రూ ను సాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి మెమొంటోను అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల జగాలను ఏలే జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని నెహ్రూ అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు, ఆలయ కమిటీ వారు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.