చాట్రాయి:-
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో చాట్రాయి వ్యవసాయ శాఖవారి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం సాగులో పంటలు పండించి వాటిని వినియోగిస్తే ఆరోగ్యంగా ఉంటారని మండల అధికారి బి శివ శంకర్ అన్నారు.ప్రకృతివ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేసుకోవచ్చని అన్నారు. కాంప్లెక్స్ ఎరువులు వాడకంతో వ్యవసాయం సాగు పోల్చితే, ప్రకృతి వ్యవసాయం వల్ల తక్కవ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందనిఅన్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి కూరగాయల పంటలు వేయటం జరుగు తుంద న్నారు.ప్రకృతి వ్యవ సాయాన్ని, సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. పత్తి పిండి, వేపాకు, ఆవు మూత్రం, నల్ల బెల్లం వివిదవాటితో పిచికారి చేసుకుని వినియోగించు కోవాలనిసూచించారు.రైతులకు క్షేత్రస్థాయిలో వరి పైరుకు సోకే చీడపీడలు తెగుళ్లు నివారణ చర్యలు గురించి, యాజమాన్య పద్ధతుల గురించి,ఉద్యాన శాఖ పశువర్ధక శాఖ స్కీములు గురించి వివరించడం జరిగింది.
ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని సూచించారు. డ్రిప్పు పరికరాలు మార్పింగ్, మిరప పంటల శాశ్వత పందిరిలు వాటి రాయి తీల వివరాలను రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, విహెచ్ఎలు పాల్గొన్నారు.