మైనింగ్ మాఫియాకు సహకరించేలా ప్రకటనలు
కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా తాత్సారం
గన్నవరం /బాపులపాడు :కృష్ణా జిల్లా, బాపులపాడు మండల పరిధిలో గల కొత్త మల్లవల్లిలో బయటపడిన సున్నపురాయి నిక్షేపాలపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం మైనింగ్ మాఫియాకు సహకరించేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సర్వే నెంబర్ 165, 166లో 12 ఎకరాల విస్తీర్ణంలో బయటపడిన సున్నపురాయి నిక్షేపాలను మాఫియా తరలిస్తుండగా, అడ్డుకోవాల్సింది పోయి, ముందస్తు సమాచారం ఇచ్చేలా చేసి, యంత్రాలను ఖాళీ చేశాక రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది.
కళ్ల ముందు సున్నపురాయి నిక్షేపాలు కనిపించినా... అవి సున్నపురాయి కాదని వాదించటం గమనార్హం. ఈ నిక్షేపాలకు సంబంధించి మైనింగ్ అధికారు లకు, కలెక్టర్కు సమాచారం అందించాల్సి ఉన్నా ఆ పనిచేయలేదు. సంఘటనా స్థలంలో స్థానికులను విచారణ చేశా మని, సాధారణ రాయి అని చెబుతున్నారని మీడియాతో అన్నారు. సున్నపురాయి గట్టిగా ఉంటుందని, ఇది అంత దృడంగా లేదని చెబుతున్నారు. మైనింగ్ మాఫియాకు సహ కరించేలా రెవెన్యూ అధికారుల వాదనలు ఉండటం గమ నార్హం. మాఫియా కనుసన్నల్లో ఒక క్రషర్ కూడా పని చేస్తోంది. ఈ క్రషర్లోనే సున్నపురాయిని పొడి చేస్తున్నారు. ఈ క్రషర్వైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు.
మల్లవల్లిలోని ఓ ప్యాక్టరీకి ఈ సున్నపురాయి. చేరుతోందని తెలుస్తోంది. దీనిపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించకపోగా, మైనింగ్ మాఫియాకు సహకరించేలా వ్యవహరించటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.