Subscribe Us

header ads

బదిలీపై వెళ్తున్న ఏపీఎం ని ఘన సత్కారం


 నూజివీడు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో సిబ్బంది ట్రాన్స్ఫర్ పై వెల్లుతున్నందున అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది.గడచిన ఐదు సంవత్సరాలు గా అగిరిపల్లి మండల ఏపీఎం బొలగాని రామకృష్ణ తన ఉద్యోగం భాద్యతను సమర్డ వంతంగా నిర్వహించి మండలాన్ని ఎల్లవేళలా అభివృద్ధి పథంలో నడిపించి బదిలీ పై రెడ్డిగూడెం మండలం వెల్లుతున్నందున మండల మహిళా సమైక్య తరుపున వివో సభ్యులు,వివో ఏ లు, అన్ని గ్రామాల వివో ప్రెసిడెంట్ లు, మహిళలు బొలగాని రామకృష్ణ ను చాలువను కప్పి పుష్ప గుచాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే బదిలీ పై వెల్లుతున సీసీ లు ఈదర క్లస్టర్ సీసీ సిహెచ్.వెంకటరత్నం,అగిరిపల్లి క్లస్టర్ సీసీ వి.అరుణకుమారి,నరసింగపాలెం క్లస్టర్ సీసీజి.భాగ్యలక్ష్మి కూడా ఘనంగా సన్మానించడం జరిగింది.

బొలగాని రామకృష్ణ మాట్లాడుతూ అగిరిపల్లి మండలాని అన్ని కపోనెంట్ లలో జిల్లాఫస్ట్ లో ఉండేలా ఇప్పటి వరకు నా విజయానికి సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, వివో ఏ లకు, మండల సమైక్య వారి అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

అలాగే మాకు ఏవిధంగా ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించారో అవిధంగానే కొత్తగా బదిలీ పై వచ్చిన కొత్త సిబ్బందికి కూడా మీరు అందరూ సహకరించి మండలాన్ని జిల్లా ఫస్ట్ ఉంచాలని ఏపీఎం బి.రామకృష్ణ తెలియజేయడం జరిగింది.

అగిరిపల్లి మండలానికి నూజివీడు మండలం నుండి బదిలీపై వచ్చిన ఏపీఎం దాయాల రాజశేఖర్ మాట్లాడుతూ ఏపీఎం బి.రామకృష్ణ గారు గడచిన ఐదు సంవత్సరాలు ఏవిధంగా మండలాని అభివృద్ధి బాటలోనడిపారో నేను కూడా నా వంతు కృషిగా అన్ని కార్యక్రమాలను విజయవంతం గా నడుపుతూ మండలానికి మంచిపేరు వచ్చేలా పనిచేస్తానని తెలియజేయడం జరిగింది.అలాగే ఏపీ సీఎం ఎఫ్ హల్ఫాన్సరాణి గారు మాట్లాడుతూ ఏపీఎం బి.రామకృష్ణ మంచి కృషి, పట్టుదల గల వ్యక్తి అని, ఆయన ఏ మండలంలో పనిచేసినా ఆ మండలాన్ని విజయపథం లో ఉచుతాడాని, ఆయన ఏ మండలంలో పనిచేసిన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దయాల రాజశేఖర్,మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు కోటా శిరీషా, సీసీలుసిహెచ్.వెంకటరత్నం,సిహెచ్.లక్ష్మీ,అరుణకుమారి,భాగ్యలక్ష్మి, దివ్య, హుస్సేన్ భి, సిబ్బంది రాంబాబు,రజీత,ఎమ్మెస్ఓబి సభ్యులు,అన్ని గ్రామాల వివో ఏ లు,వివో ప్రెసిడెంట్ లు, స్వయం సహాయక బృందం ల మహిళలు పాల్గొన్నారు.