విజయవాడ :స్టూడెంట్స్, టీచర్స్, ఎడుకేటర్స్, పేరెంట్స్ (స్టెప్) ఆధ్వర్యంలో అక్టోబర్ 04,05,06 వ తేదీలలో ఉచిత ఉపాధ్యాయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని స్టెప్ సమన్వయ కర్తలు మంజీర గళం పత్రిక ప్రకటనలో తెలియజేసినారు.
విద్యార్థులలో వున్న మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపి తద్వారా వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులు కావాలని అందుకోసమే ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని తుళ్ళూరు మండలం నెక్కళ్లు గ్రామంలో ఉన్న ధ్యాన మందిరంలో మూడు రోజుల పాటు జరుపుతామని ఇందులో పాల్గొనే ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజనంలతో పాటు మెటీరియల్ మరియు సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని కావున ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులు ఈ నంబర్ 9848081348 లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా స్టెప్ సమన్వయ కర్త కె. జయరాజు తెలిపారు.