Subscribe Us

header ads

బుద్ధ, పూలే, అంబేద్కర్ విద్యా విలువల పునాదే ధర్మ టీచర్స్ యూనియన్.


 కొత్తగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ధర్మ టీచర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనియన్ పరిచయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కన్వీనర్ కేసు పాక సీతారామరాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా దామెర ఉపేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకై మరియు ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారానికై ధర్మ టీచర్స్ యూనియన్ ఏర్పడిందని అన్నారు.

 ముఖ్యంగా బుద్ధ,పూలే,అంబేద్కర్ విద్యా విలువల పునాదిగా విద్యని ప్రజాస్వామీ కరించాలని ధర్మ టీచర్స్ యూనియన్ ప్రకటించిందని అన్నారు.


భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కుల రక్షణ కొరకు ఉపాధ్యాయుల సర్వీస్ కు సంబంధించిన జనరల్ హక్కుల సాధన కొరకు, అంతిమంగా అసమానతలు లేని సమానత్వంతో కూడిన గౌరవప్రదమైన జీవితాల కొరకు ధర్మ టీచర్స్ యూనియన్ పోరాడుతుందని అన్నారు, ఆయా సంఘాల్లో రెండవ శ్రేణి పౌరులుగా ప్రాధాన్యత లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ప్రజాస్వామ్య అగ్రకుల టీచర్ల ఆత్మగౌరవాన్ని చంపుకొని కొనసాగుతున్నారని, వారంతా బయటికి వచ్చి రాజీలేని పోరాటం చేసే ధర్మ టీచర్స్ యూనియన్ లో సభ్యత్వం స్వీకరించాలని కోరారు.రాష్ట్రంలో 50 సంఘాలు ఉన్నప్పటికీ సమస్యల సాధన విషయంలో అన్నీ కూడా ప్రభుత్వంతో రాజీ పడటం,ఒప్పందాలు కుదుర్చుకోవడం తో సంఘ నాయకులు సమస్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారిస్తున్నందున బాధిత ఉపాధ్యాయులే రోడలెక్కాల్సిన పరిస్థితి త లెత్తిందని,నిన్న చంటి పిల్లలతో 317GO బాధితులు గాంధీ భవన్ ముట్టడించిన తీరే తాజా ఉదాహరణ అని అన్నారు.


అన్ని కేడర్ల సమస్యల పరిస్కారం కొరకు ముందువరుసలో ఉండి పనిచేస్తున్నది ఒక ధర్మ టీచర్స్ యూనియన్ నాయకులే అని అన్నారు. గౌరవ ముఖ్య మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని సింగరేణి స్కూల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్స్ కు మినిమమ్ టైం స్కేల్, 12 నెలల జీతం ఇవ్వాలని, సింగరేణి స్కూల్స్ లో 2009నుంచి ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వాలని, సింగరేణి ఉపాధ్యాయులకు పదోన్నతులలో రూల్ అఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసారు.పిఆర్సి రిపోర్టు వెంటనే ప్రకటించాలని,317 జీవో బాధితులందరికీ న్యాయం చేయాలని,

నాలుగు డీఎ లను వెంటనే ప్రకటించాలని,పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించాలని,కంప్యూటర్ విద్యను కొనసాగించాలని,ఎస్ జి టి లకు సరైన న్యాయం చేయాలని,700 గురుకుల విద్యాలయాలకు పక్క భవనాలు నిర్మించాలని, రాష్ట్రంలో సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న 22,000 మంది ఒప్పంద ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, అన్ని జిల్లాల్లో డిప్యూటీ డీఈఓ లను రెగ్యులర్ డీఈఓ లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను రూపొందిచి అమలుచేయాలనీ డిమాండ్ చేసారు.


కార్యక్రమంలో ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముదిగొండ్ల వేణు, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, భాస్కర్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.