ఏలూరుజిల్లా మాజీ రాష్ట్రపతి, భారతరత్న, అణుశాస్త్ర పితామహుడు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు, ఎంపీ కార్యాలయం సిబ్బంది అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం జీవితాంతం శ్రమించిన మహనీయుడు కలాం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిల్లీ నుంచి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యా, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఎనలేని సేవలందించిన కలాం చిరస్మరణీయులని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కీర్తించారు. సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాంను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు.అబ్దుల్ కలాం జయంతి వేడుక కార్యక్రమంలో కూటమి నాయకులు కాట్రు బాలకృష్ణ, వీర్ల ప్రతాప్, మల్లిపూడి రాజు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.