జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట లో శుక్రవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామం స్థానిక అంగనవాడి కేంద్రం వద్ద
అంతర్జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాన్ని స్థానిక అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి మరియు సిబ్బంది చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గ్రామ ఉపసర్పంచ్ ప్రముఖ న్యాయవాది వింజమూరి కిరణ్ కిషోర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై లింగ అసమానతలు ,విద్యా ,పోషణ చట్టపరమైన హక్కులు వైద్య సంరక్షణ పలు అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ గొల్లమందల శ్రీనివాసరావు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి ఆడపిల్లలు అన్ని రంగాలలో నైపుణ్యత సాధించాలని అంతర్జాతీయ బాలిక దినోత్సవ ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడారు కార్యక్రమం అనంతరం మొక్కలు నాటి అంగనవాడి పిల్లలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు