దేవరపల్లి:-
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు రతన్ టాటా మృతికి నివాళులు అర్పిస్తూ నాయకులు, కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఒక పారిశ్రామిక వేత్తే కాదు గొప్ప సమాజ సేవకుడు ఆయనకు వచ్చే లాభంలో 65 శాతం సమాజ సేవకే ఖర్చు పెట్టేవారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. భారతీయ పారిశ్రామిక రంగంలో ఆయన ఒక దిగ్గజం, అధికారంలో ఉన్న వారితో కూడా చాలా నిక్కచ్చిగా మాట్లాడే ధైర్యశాలి. ప్రపంచంలో అన్ని రకాల గుండు సూది నుండి గూడ్స్ రైలు వరకు స్వాతంత్రం రాక ముందు నుంచి దేశంలోని ఉన్నత పరిశ్రమంగా టాటా స్టీల్ ప్లాంట్ స్థాపించి ప్రభుత్వానికి ఎనలేని వినియోగ అవకాశాలను అందించారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండే నిత్యవసర సరుకులు టీ పొడి నుండి నీరు నుంచి సాల్ట్ వరకు అన్ని నాణ్యమైన పదార్థాలు అందుబాటులోకి తెచ్చి ప్రజల నుండి మంచి ఆప్యాయత పొందారు.
ఆయన ఒక గొప్ప జాతీయవాది, ఆయన చేసే అన్ని వ్యాపారాల లోను అన్ని నిబంధనలు పాటిస్తూ టాటా గ్రూపు పనితీరులో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన మృతి మన భారతదేశానికి తీరని లోటు. అలాగే కరోనా సమయములో కూడా ఆయన 1500 కోట్లు కరోనా నిర్మూలనకు ఖర్చు చేశారు. ప్రపంచంలో ఎవరూ కూడా ఆయన లాగా ఉండలేరు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి మన దేశానికి తీరని లోటు అని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ సువర్ణ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల ఉపాధ్యక్షులు శివ నాగ ప్రసాద్, జనసేన నాయకులు పసుపులేటి ప్రసాద్, మాధవరపువెంకటేశ్వరరావు,దాసరి శేషు, పోలుమాటి నాని, జన సైనికులు గంటా సురేష్, మన్నెన సతీష్, మడాల సుందర్ సింగ్, పుప్పాల ప్రసాద్, సిద్దా వెంకట్, లిఖిత్, ప్రవీణ్, మణికంఠ, జగదీష్, దినేష్ పాల్గొన్నారు.