Subscribe Us

header ads

నేటితరం రాజకీయ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తి దాయకులు:దేవరపల్లి సురేష్


 అమరావతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్ తన పనితీరుతో నేటి తరం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు స్పూర్తిగా నిలుస్తున్నారని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు.

విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సురేష్ బాబు మాట్లాడుతూ... రాజకీయాలు, పదవులను సంపాదనకు,అధికార దర్పానికి మార్గాలుగా భావించే ప్రస్తుత తరం నేతలలో కొత్త ఆలోచనలు,స్ఫూర్తిని రేకెత్తించేలా పవన్ కళ్యాణ్ పనితీరు ఉందన్నారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో పలు గ్రామపంచాయతీలకు తన వ్యక్తిగత నిధులు కేటాయింపుతో పాటు,రాష్ట్రంలో వివిధ రకాల విపత్తులకు లోనైన పలువురు అభాగ్యులకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎక్స్గ్రేషియా చెల్లించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

 పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు సైతం పంటల నష్టానికి గురైన అనేక మంది రైతులకు వ్యక్తిగతంగా సాయ పడ్డారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలల వ్యవధిలోనే గ్రామాలలో రికార్డు స్టాయిలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ అవసరం అయ్యే కనీస వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణ ఆదేశాలు ఇస్తూ పరిష్కారం కొరకు సమీక్షలు చేస్తూ ప్రజలకు ప్రజాప్రతినిధులు ,అధికారుల పట్ల నమ్మకం పెంచేలా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ పరిపాలనా శైలి అభినంద నీయమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో గ్రామాల అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం నెలకొంటుందని సురేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం,గ్రామాలలో సమస్యల పరిష్కారం కొరకు తమ అసోసియేషన్ పక్షాన కూడా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సూచనలు చేయనున్నట్లు సురేష్ బాబు తెలిపారు.