Subscribe Us

header ads

శ్రీ నూకాలమ్మ అమ్మ వారి దేవస్థానంలో దసరా ఉత్సవాల కొనసాగింపులో భాగంగా గోపూజ.

 జంగారెడ్డిగూడెం:-

ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న 
శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల కొనసాగింపులో భాగంగా,అమ్మ వారికి ప్రాతః కాల పూజలు, నిత్య పూజా కైంకర్యాలు,సాయంసంధ్య హారతి పూజలు విశేష హారతి పూజలు మరియు గోపూజ అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు డాక్టర్ రాజాన మాట్లాడుతూ అక్టోబర్ 3 న ప్రారంభమైన దసరా ఉత్సవాలు 16వ తేదీన జరిగే 68 వ చండీహోమం, మహాపూర్ణాహుతి తో సంపూర్ణమవుతాయని అన్నారు. సర్వ దేవతా నిలయమైన ఆవుకుదూడలకు గోపూజ నిర్వహించామని తెలియ జేశారు.

పోలుపర్తి కన్నారావు దంపతులు రూ.10,116/లు, దొమ్మేటి శ్రీనివాసరావు దంపతులు రూ 10,116/లు మరియు నూకల సత్యనారాయణ దంపతులు రూ 5,116/లు దసరా ఉత్సవాల నిర్వహణకు రూ విరాళంగా అందజేశారు అని అన్నారు.
వారిని, వారి కుటుంబ, వ్యవసాయ, వ్యాపార, వృత్తి ఉద్యోగాలనుఅమ్మ వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. ఈ నెల 16వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి అమ్మ వారి సన్నిధిలో ఉన్న యాగశాల నందు, లోక కళ్యాణార్థం 68వ చండీ హోమం జరుగుతుందని, పాల్గొనదలచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి, కార్యాలయము నందు పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. 

చండీహోమంలో పాల్గొనుట వలన ఈతిబాధలు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృధ్ధిగా పండి ప్రజలు ఆయారారోగ్యాలతో సుభిక్షంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బందీ కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.