అమరావతి,
నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో "పల్లె పండుగ వారోత్సవాలు" కార్యక్రమంలో పాల్గొని దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్అడిగిన వెంటనే నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.11 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడ్డ ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు: గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి దుర్గేష్ దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా విజ్జేశ్వరంలో రూ.35.15 లక్షలతో 10 పనులు, కలవచర్లలో రూ. 26.35 లక్షలతో 3 పనులు, జీడిగుంటలో రూ.18.25 లక్షలతో 3 పనులు, కోరుపల్లిలో రూ. 32 లక్షలతో 15 పనులు, పెండ్యాలలో రూ. 36.31 లక్షలతో 6 పనులు
, మునిపల్లిలో రూ. 19.36 లక్షలతో 3 పనులు, శెట్టిపేటలో రూ.35.26 లక్షలతో 4 పనులు, తాళ్లపాలెంలో రూ.25.76 లక్షలతో 5 పనులు, ఉండ్రాజవరం మండలంలోని వెలివెన్నులో రూ. 54.20 లక్షలతో 9 పనులకు మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేశారు. అంతేగాక గోపవరం గ్రామంలో "మన బడి-మన భవిష్యత్" క్రింద మండల పరిషత్ పాఠశాలలో నిర్మించనున్న అదనపు తరగతి గది ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామాల్లో సీసీ రోడ్లతో పాటు రాబోయే రోజుల్లో డ్రెయిన్లు, ఆర్ అండ్ బి రోడ్లు వంటి పనులకు ప్రాధాన్యతనిచ్చిన కూటమి ప్రభుత్వం త్వరితగతిన అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టనుందన్నారు. ఎర్రకాలువ వరద ఉధృతి ద్వారా నష్టపోయిన రైతన్నలకు త్వరలోనే ఇన్ ఫుట్ సబ్సిడీ అందిస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 రోజుల్లోనే రూ.3,000 పెన్షన్ ను రూ.4,000 కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి గుర్తుచేశారు.దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15 వేలు ఇస్తూ భరోసా కల్పిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ ప్రకటన చేశామన్నారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం దీపావళి నుండి ఉచితంగా గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తామన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కలిసి ప్రజలకు సేవ చేయాలని సంకల్పించారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు