భీమునిపట్నం:-
భీమిలి మండలం టీ .నగరపాలెం గ్రామపంచాయతీలో ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పల్లె పండుగ అను కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి సిసి రోడ్లు వేయడానికి ఆదేశించారు. దీనిలో భాగంగా టీ నగరపాలెం గ్రామపంచాయతీకి
ఎన్ ఆర్ జి ఎస్ నిధులు నుంచి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేయడానికి భీమిలి నియోజవర్గ కూటమి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో భీమిలి ఎంపీడీవో హనుమంతరావు టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు, బిజెపి ఇంచార్జ్ కె . రామనాయుడు, భీమిలి జడ్పిటిసి గాడు వెంకటప్పడు, భీమిలి మండల టిడిపి పార్టీ ప్రెసిడెంట్ డి ఎ ఎన్ రాజు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ నక్క శ్రీధర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు సరగడ అప్పారావు, టిడిపి సీనియర్ నాయకులు తమ్మిన వెంకటరమణ, పాత్రుడు, పళ్ళ రామారావు, మాజీ సర్పంచ్ పోట్నూర్ రాము, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోట్నూరు చిట్టిబాబు, భీమిలి మండల జనసేన పార్టీ సెక్రటరీలు కొయ్య శ్రీనివాసరావు, పొట్నూరు కొండబాబు, పడగల గురునాయుడు నాయుడు ,టిడిపి పార్టీ ప్రెసిడెంట్ దువ్వి సురేష్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఇదిపిల్లి నానాజీ, టిడిపి నాయకులు జనసేన పార్టీ నాయకులు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.