Subscribe Us

header ads

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు జోహార్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

 జగ్గంపేట :

కాకినాడలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అక్టోబర్ 21 పురస్కరించుకునే పోలీస్ అమరవీరుల దినోత్సవం ఎస్పి విక్రమ్ పాటిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పూలదండలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రపంచమంతా నిద్రలో ఉంటే మీరు మేల్కొని శాంతి
 
భద్రతల పరిరక్షణ కోసం ఎండా వాన సైతం లెక్కచేయకుండా పనిచేసే ప్రజల కోసం జీవించి సమాజ యోగక్షేమాల కోసం తమ ప్రాణాలను సైతం రుణప్రాయంగా విడిచిన త్యాగమూర్తు లైన పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నామని ఆయన సంతాపం సందేశం అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం,కుంచె రాజా తదితరులు పాల్గొన్నారు.