Subscribe Us

header ads

జైశ్రీరామ్ దేవాలయం నూతన నిర్మాణ కార్యక్రమం గొల్లమందల గౌడ బజార్

ఏ కొండూరు:-

జైశ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గొల్లమందల గ్రామంలో గౌడ బజార్ సెంటర్లో గత 30 సంవత్సరాల నుండి తాటాకు పందిరి లు వేసుకొని హిందూ ధర్మానికి సంబంధించిన అన్ని ఉత్సవాలు చేసుకోవడం జరుగుతున్నది. అది ఈ స్థలము నందు శ్రీ కోదండ రామాలయ నిర్మాణమునకు ది:21.10.2024 నా సోమవారం ఉదయం 8:25 నిమిషములకు రోహిణి నక్షత్ర ముక్త వృక్షిక లగ్న మందు శంకుస్థాపన చేయుటకు పెద్దల సమక్షమున దైవ యజ్ఞములచే సుముహూర్తం నిర్ణయించబడినది. 

ప్రపంచంలో ఏ గ్రామంలోనైనా ఏ పల్లెలోనైనా తాటాకు పందిరులు వేసి ఉత్సవాలు జరుపుకునే వారందరూ కూడా ఈ రకముగా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం దేవాలయాలు నిర్మించుకోవాలని ప్రముఖ వాస్తు సిద్ధాంతి టీటీడీ ధర్మ చర్చ దాశరధి పిలుపునిచ్చారు. ఈ శంకుస్థాపన సందర్భముగా గ్రామ పెద్దలు మరియు కమిటీ వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభం సర్వేజన సుఖినోభవంతు మంగళం మహాతు