ఇబ్రహీంపట్నం :ఎన్టీఆర్ జిల్లా,ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న కొండపల్లి గ్రామంలో గల ఎన్ టి టి పి ఎస్ థర్మల్ ప్లాంట్ అకౌంట్ ఆఫీస్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో ముఖ్య నాయకులతో మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ డాక్టర్ వుండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ...ప్రతి ఓటర్ కి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం చేపడుతున్న చర్యలను ఓటర్లకు వివరించారు. దానిలో భాగంగా
ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని,పట్టభద్రులను కోరారు.
ఈ కార్యక్రమం లో చుట్టుకుదురు శ్రీనివాసరావు,కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు,చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి రావి,ఫణి బాబు,ప్రధాన కార్యదర్శి కొండపల్లి మున్సిపాలిటీ, కౌన్సిలర్ చనుమోలు నారాయణ కౌన్సిలర్ చుట్టుకుదురు వాసు కౌన్సిలర్ కూటమి ప్రభుత్వం కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.