కులమతాలకు అతీతుడైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రాంగణంలో సద్దమ్మ ఉపోసత క్యాలెండర్ ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ ఎస్సీ కమీషన్ చైర్మన్ విక్టర్ పాల్ అన్నారు.
విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద బంతే ధమ్మ దజ తెరో ఆధ్వర్యంలో మొట్ట మొదటి బుద్ధ కార్యక్రమంలో భాగంగా 2024 సద్దమ్మ ఉపోసత క్యాలెండర్ ను ఎస్సీ కమీషన్ చైర్మన్ విక్టర్ పాల్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బంతిజె ఆధ్వర్యంలో బుద్ధ వందనం చేసి అందరిచేత బుద్ధ దీక్ష చేయించి క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నాంచారయ్యా, వెంకటేశ్వరరావు, నాగరాజు, కొండలరావు, ఉండవల్లి ప్రదీప్, నిమ్మగడ్డ కోటేశ్వరరావు, సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.