ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల విస్సన్నపేట లో సకాలంలో విధులు నిర్వహిస్తూ తమ పనిని సక్రమంగా పూర్తి చేసుకుంటూ విస్సన్నపేట మండల ఇరిగేషన్ శాఖ ఏఈగా మండల ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉంటూ తన బాధ్యతగా వృత్తిరీత్యా పనులను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సంపూర్ణంగా పనులు పూర్తి చేయడంతో గత సంవత్సరం ఉత్తమ అవార్డు గ్రహీతగా బెస్ట్ సర్టిఫికెట్ పొంది రెండోసారి 2024 జనవరి 26వ తేదీన అనగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిలే రావు చేతుల మీదుగా విజయవాడలో కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి రాజు బెస్ట్ అవార్డు గ్రహీతగా సర్టిఫికెట్ అందుకున్నందుకు అభినందనలు మండల ప్రజలు అధికారులు తెలిపారు.