ప్రజా ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టం -27/2023 రద్దు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే అంశంపై సిపిఐ ఎమ్ఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నూజివీడు అమర్భవన్లో 26వ తేదీ ఉదయం 11 గంటలకు సదస్సు నిర్వ హిస్తున్నట్లు ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లా రావు తెలిపారు, సదస్సు కు ముఖ్య అతిథిగా ఐర్లా జాతీయ కార్యదర్శి పి ఎస్ అజయ్ కుమార్, లిబరే షన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు డి.హరినాథ్ హాజరవు తున్నట్లు తెలిపారు.
నూజివీడు డివిజన్లో ముసునూరు మండలం రమణక్కపేట,,చిత్తపూరు, కోటపాడు, మర్రిబంధం, చీపురుగూడెం, బాసార పాడు గ్రామాల్లో, పేదలు సాగు చేస్తున్న భూముల కురెవెన్యూ రికార్డులో "అటవీ "క్లాసిఫికేషన్ మార్చి,అటవీ భూముల కుఇచ్చిన "4"నోటిఫికేషన్ రద్దు చేయాలని,రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే చేపట్టి, ఎంజాయ్ మెంట్ లో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలని సదస్సు ద్వారా కోరన్నట్లు తెలిపారు. అటవీ భూములు ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులు ప్రజలు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని డి హరినాథ్, డి పుల్లారావు విజ్ఞప్తి చేశారు.