(మంజీరగళం )ప్రతినిధి : చింతలపూడి,
ఏలూరుజిల్లా చింతలపూడి నియోజకవర్గం, నామవరం గ్రామంలో 20 కోట్లతో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి, చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మరియు పలువురు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, గ్రామసభల్లో వచ్చిన అన్ని వినతులు పరిష్కరిస్తామన్నారు. 20 కోట్లతో ఈరోజున చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్ర బాబు నాయుడు సహకారంతో ఏలూరు పార్లమెంట్ అన్ని నియోజకవర్గాలలోను రోడ్లు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఎటువంటి రోడ్లు వేయలేదని, ఎక్కడ రోడ్ ఉందో, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, పలు రోడ్ల ప్రమాదాల వలన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, కూటమి ప్రభుత్వ పాలన లో ఎటువంటి అనర్ధాలు జరగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఘంట మురళీ, పెద్ద ఎత్తున స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.