Subscribe Us

header ads

ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి వైద్యం


  (మంజీర గళం )ప్రతినిధి :ఆగిరిపల్లి 

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి

మండల పరిషత్ ఎండిఓ కార్యాలయం వద్ద ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం (గ్రా) నేతృత్వంలో,విజయవాడ సెంటినీ ఆసుపత్రి వైద్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రా జాతీయ చైర్మన్ కాసల కోనయ్య ఉచిత మందుల పంపిణీ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ మెగా వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు కాగిత కృష్ణచంద్,కాగిత రాకేష్ లుగుండె,వెన్నుముక,బిపి,షుగర్,ఎముకలు,మోకాళ్ళ నొప్పులు,జీర్ణకోశవ్యాధులు,మూత్రపిండాలు,మూత్ర కోశ వ్యాధులు,స్త్రీల సంబంధితసమస్యలు,ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు,సాధారణ వ్యాధులను పరీక్షించి,కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రా జాతీయ ప్రధాన కార్యదర్శి పత్తిపాటి సురేష్ కుమార్, మూర్తి, జిల్లా చైర్మన్ నంజం రామకృష్ణ, మోహన్ స్పిన్ జిఎం తాండవ కృష్ణ, ఎండిఓ పి శంకర్రావు, రీజనల్ మీడియా చైర్మెన్ ఎస్ ఎస్ బాబు,జిల్లాసలహాదారులు ముసునూరి సతీష్

కుమార్,ఏలూరు జిల్లా వైస్ చైర్మన్ పలగాని.వెంకట

కోటేశ్వరావు,కుప్పాల.నాగరాజు,మొగసాటి.శంకర్ రాజు,గునిశెట్టి.సత్యనారాయణ,తవ్వ మురళీధర్ పాల్గొన్నారు.