Subscribe Us

header ads

శాసనసభ్యుని చొరవతో సాగర్ జలాలు


(మంజీర గళం ప్రతినిధి ):రెడ్డిగూడెం.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కృషితో మూడో జోన్ కు సాగర్ జలాలు విడుదల చేయించారని జల వనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ తెలియజేశారు.ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని మద్దులపర్వ గ్రామం వద్ద సాగర జలాలకు పసుపు కుంకుమ పూలు వేసి స్థానిక నాయకులతో కలిసి

సాగర్ జలాలను పరిశీలించారు.ఆళ్ల గోపాలకృష్ణ మట్లాడుతూ ముద్దులపర్వ లో 5.960 రెగ్యులేటర్ వద్ద సాగర్ జలాలు చేరుకున్నయని తెలిపారు.ప్రస్తుతం 500 క్యూసిక్కులుగా విడుదలైనట్లు మరింత పెంచి నూజివీడు మైలవరం బ్రాంచ్ కెనాల్స్ కు నీరు విడుదల చేసి పంటలను కాపాడుతామని తెలిపారు.మైలవరం శాసనసభ్యులకు రైతులతో కలిపి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమినాయకులు,రైతులు పాల్గొన్నారు.