(మంజీరగళం) ప్రతినిధి: జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం బుట్టాయిగూడెం రోడ్ లోని డ్రైనేజీలు పూడికపోవటం వలన వర్షపు నీరు ప్రవహిస్తుంది దీనివలన ప్రజలు చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా చైర్మన్ బత్తిన నాగ లక్ష్మి ఆదేశాల మేరకు పది రోజులుగా డ్రైనేజీలోని పూడికిపోయిన మట్టిని ప్రత్యేక సిబ్బందితో శుభ్రం చేయించడం జరిగింది మంగళవారం రోజు చైర్పర్సన్ బత్తిన నాగ లక్ష్మి సందర్శించారు వర్షం పడడం వలన డ్రైనేజీల పూడిక పోయాయని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుర్గాప్రసాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ పాల్గొన్నారు