Subscribe Us

header ads

ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నూతన భవనానికి అంచనాలు రూపొందించండి. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.


 
(మంజీరగళం)ప్రతినిధి.ఏలూరు

ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నూతన భవన నిర్మాణానికి సమగ్ర అంచనాలతో పరిపాలనా అమోదం కొరకు ప్రతిపాధనలు తయారు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్ధ అధికారులను జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధ్యక్షతన సెస్సు కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్ధానిక సంస్ధల నుండి సుమారు రూ. 20 కోట్లు, గ్రంథాలయ సెస్సు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్ధకు బకాయివున్నట్లు గుర్తించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రస్తుతం నిర్వహించబడుతున్న భవనం శిథిలావస్ధలో ఉన్నందున వెంటనే నూతన భవన నిర్మాణం చేపట్టవలసివుందన్నారు. ఇందుకు స్ధానిక సంస్ధల నుంచి వున్న బకాయిలు రూ. 

 20 కోట్ల నుండి వెంటనే 10 శాతం చెల్లించేందుకు, స్ధానిక సంస్ధలు నిర్ణయించే ఆస్ధి లేక ఇంటిపన్నుపై 8 శాతం చొప్పున గ్రంథాలయ సెస్సు డిమాండ్ కు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయాలని మున్సిపల్ కమీషనర్లు, జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని వైటిసి భవనంలోకి మార్చుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్ధ కార్యదర్శిని ఆదేశించారు.  సమావేశంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి యం. శేఖర్ బాబు, డిప్యూటీ లైబ్రరియన్ ఎ. నారాయణ, పలువురు మున్సిపల్ కమీషనర్లు, జిల్లా ఆడిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.