ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వర్షాకాలం లో దోమల వ్యాప్తి లేకుండా అందరూ కృషి చేయాలని ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ గంగినాయుడు కోరేరు. మండలం లోని ఇచ్చాపురం గ్రామం లో ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యం లో జరుగుతున్న శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కాలం లో ఎక్కువగా వచ్చే మలేరియా వ్యాధి రాకుండా వుండాలంటే దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ఇంటి లోని నీటి నిల్వలు ఎక్కువ రోజులు వుంచితే వాటిలో దోమలు గుడ్లు పెడతాయి అని, తద్వారా దోమలు వృద్ధి చెందుతాయని తెలిపేరు.
లార్వా దశ లోనే దోమల వ్యాప్తి నీ అరికట్టాలని, దాని కోసం వారానికి ఒకసారి పూర్తిగా నీటి నిల్వలు తీసివేసి కొత్త నీటిని నింపాలని కోరేరు. అలాగే తాగి పడవేసిన కొబ్బరి బోండాలు, టీ కప్పులు ల లో వర్షం నీరు చేరి దోమల వ్యాప్తి జరుగుతుందని, దీనినీ కూడా అరికట్టాలని చెప్పేరు. సామాజిక ఆరోగ్య అధికారి పి సాంబమూర్తి మాట్లాడుతూ విరోచనాలు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు రాకుండా పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని సూచించేరు. కాచి చల్లార్చి న నీటిని తాగాలని చెప్పేరు. ఈ కార్యక్రమంలో అరోగ్య పర్యవేక్షకులు కృష్ణ మోహన్ , ఎం ఎల్ హెచ్ పీ స్వర్ణలత, ఏ ఎన్ ఎం మెట్ట దేవి, ఆశ కార్యకర్త దేముడమ్మ తదితరులు పాల్గొన్నారు.