Subscribe Us

header ads

ఎంపీపీ స్కూల్ ఈదులగూడెం నందు వనమహోత్సవ వేడుకలు


 మంజీరగళం ప్రతినిధి: ఆగిరిపల్లి

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం 2024 కార్యక్రమంలో భాగంగాప్రధానోపాధ్యాయిని శ్రీమతి ఎం నాగమణి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీమతి చిట్నేని విజయకుమారి శేషగిరిరావు పాల్గొని పాఠశాలలో మొక్కలు నాటారు.సర్పంచ్ శ్రీమతి చిట్నేని విజయ్ కుమారి మాట్లాడుతూ అడవుల నరికివేత కారణంగా పర్యావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులను నిరోధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం హర్షణీయమని అలాగే పాఠశాలలో మొక్కలు నాటడానికి చాలా తక్కువ ప్రదేశం ఉన్నప్పటికీ ఆ కొద్ది ప్రదేశాన్ని కూడా సద్వినియోగం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాల ఎం.నాగమణి,ఉపాధ్యాయుడుఅంకం. వెంకటేశ్వరరావులు లు మాట్లాడుతూ పంచాయతీ వారి సహకారంతో పాఠశాలలో మామిడి ఉసిరి గానుగ మరికొన్ని అటవీమొక్కలను నాటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిలు శ్రీమతి హసీనా బేగం,శ్రీమతి కొవ్వలి కోటమ్మ, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి,గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.