విజయవాడ
విజయవాడలో సమీక్ష నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల,జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ ఎంజీ రోడ్డు లోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఈరోజు ఉదయం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారుల్లోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పెండింగ్ బిల్లులకు ఓట్ ఆన్ బడ్జెట్లో కేటాయించిన రూ.256 కోట్లు త్వరగా జమ అవ్వటానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు,రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్, జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తదితరులు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్,ఇంజనీరింగ్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు,చీఫ్ ఇంజనీర్ వై. శ్రీనివాస్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నీరు చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదుల విభాగం బాధ్యులు,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, సభ్యులు చెన్నుపాటి శ్రీధర్, కవులూరు రాజా చంద్రమౌళి తదితరులు ఈ పెండింగ్ బిల్లు చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాలతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు వినతి పత్రం సమర్పించారు.
ఇదే విషయమై ఈరోజు సాయంత్రం విజయవాడలోని సాగునీటి వినియోగదారుల సంగాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుంచి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ... ఎన్.డి.ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-2019 మధ్యకాలంలో చేసిన నీరు చెట్టు పనుల కోర్టు కేసులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రూ.427 కోట్ల రూపాయలు ఉండగా దీనిమీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి దశాదిశా నిర్దేశంతో ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు బిల్లులు చెల్లించటానికి రూ.256 కోట్లు కేటాయించారని ఇప్పటివరకు రూ.46 కోట్లు మాత్రమే రైతులు ఖాతాలో జమఅవగా ప్రస్తుతం జలవనరుల శాఖలో కంప్యూటరీకరణ,డిజిటలైజేషన్ వలన పెండింగ్ బిల్లులు అప్లోడ్ చేయడం ఆలస్యం జరుగుతుందని ఈ విషయాన్ని ఇరువురు మంత్రుల దృష్టికి తీసుకురాగా వారు వెంటనే జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసి మిగిలిన చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి,రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు పోతుగంటి పీరయ్య,మొవ్వ సుభాషిని తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర టీ డీ పీ ఫిర్యాదుల విభాగం సభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను దూశాలువాతో ఘనంగా సత్కరించి పుష్ప గుచ్ఛం అందచేశారు.