తిరువూరు మండలం, ఎర్ర మాడు గ్రామపంచాయతీలో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు.ఈరోజు ఎర్ర మాడు గ్రామంలో, గ్రామ సర్పంచ్ బొర్రా మాధవి గారి ఆధ్వర్యంలో, వన మహోత్సవంలో భాగంగా. పచ్చదనాన్ని పెంచే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిపించడంజరిగింది, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవి గారు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామం పచ్చదనంతో,కళ కళ లాడాలని, కోరారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలోగ్రామపంచాయతీ సెక్రెటరీ కె రంగారావు గారు,మరియు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు. బండి అచ్యుత్ రావుగారు,మరియు జనసేన పార్టీ గ్రామ నాయకుడు బోపిశెట్టి ప్రసాదు గారు.మరియు టిడిపి నాయకులు తేలప్రోలు మోహన్ రావు గారు సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు