(మంజీరగళం ప్రతినిధి) ఆగిరిపల్లి
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో వెంచివున్న శ్రీ కృష్ణుని గుడి సన్నిధానంలో నిర్వహించిన శ్రీకృష్ణుని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ కృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.తొలుత వేదపండితులు అర్చకులు మేళ తాళలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ప్రత్యేక పూజలు నిర్వహించి దుశాల్వాతో రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధిని సత్కరించి ఆశీర్వచనం అందించారు.మంత్రివర్యులు మాట్లాడుతూ గ్రామాలలో పూర్వం అందరూ కలిసి మెలిసి కోలాటాలు కర్రసాము వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అందరూ అన్నదమ్ములా ఉండేవారని తద్వారా ఆరోగ్యం ఆనందంతో సంతోషంగా జీవించేవారని అన్నారు.ఈ ఆధునిక జీవనంలో ప్రతీ ఒక్కరూ బిజీ బిజీ జీవితం గడపడం ద్వారా ఇలాంటి సంస్కృత కార్యక్రమాలు లేక కొంత కుటుంబ నైతిక విలువలు కొరవడ్డాయని ఇకనుండైన ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయాలు పాటించడం మంచిదని సూచించారు.కుటుంబ వ్యవస్థ మెరుగు పడి సహోదర ప్రేమ ఆప్యాయత అనురాగం కల్గి తద్వారా మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు.గ్రామంలో త్వరగా స్థల సేకరణ చేస్తే వెంటనే శ్రీకృష్ణుని గుడి కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.శ్రీ కృష్ణుని జన్మదిన వేడుకల్లో భక్తులకు అన్నప్రసాధాలు వడ్డించి భక్తులకు అభివాదం చేసిన మంత్రివర్యులు శ్రీ కృష్ణుని కరుణా కటాక్షంతో జిల్లా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్ర రైతాంగం అంతా పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు.శ్రీ శ్రీ కృష్ణుని కరుణా కటాక్షంతో నూజివీడు నియోజకవర్గ ప్రజలు రైతులకు మేలు జరగాలని అదే విధంగా గొర్రెలు,మేకలు,ఆవులు, గేదెలువంటి పశు సంపద అంతా దిన దిన అభివృద్ధి చెంది తద్వారా ప్రజలంతా ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెండుగా ఉండాలని తద్వారా మంచి పరిపాలన అందించాలని అన్నారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బహుళ జాతి పరిశ్రమలు మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయని త్వరలో వాటిని నెలకొల్పడం ద్వారా యువతీ యువతకు లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి రాష్ట్రం ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అపార అనుభవం దూరదృష్టి చిత్తశుద్ధి కల్గిన ఆర్ధిక నిపుణుడైన ముఖ్యమంత్రి గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాకతో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో ముందుకెళుతుందన్నారు. అలాంటి నాయకుడికి ఎల్ల వేళలా శ్రీ కృష్ణుడి కరుణా కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ ఎన్ వేణు,ఈదర గ్రామ సర్పంచ్ దొండపాటి ఏసు పాదం,ఎన్ సతీష్,డి సాయి,ఎన్ వీర్రాజు,గ్రామ యాదవసంఘ నాయకులు,కమిటీ యువకులు,మహిళలు, పాల్గొన్నారు.