(మంజీరగళం ప్రతినిధి): ఆగిరిపల్లి
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలోని స్వయంభు శ్రీ శోభనాచల వ్యాఘ్ర
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉత్సవ విగ్రహం చోరీకి గురైంది.స్వామివారి ఆలయంలో (మూడు గుళ్ళ వద్ద) గంటతోపాటు, ఒక అడుగు ఎత్తుగల ఉత్సవ విగ్రహం చోరీ చేసినదుండగులు.మంగళవారం సాయంత్రం చోరీకి గురైనది.ఆలయ తాళాలు పగలగొట్టి పంచలోహ ఉత్సవ విగ్రహం, ఇత్తడిగంట,ఇత్తడి పళ్లెం చోరీ కాబడ్డాయి.చోరీ విషయం తెలిసి దేవాలయ ఈవో సురేష్ బాబు,అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.రేపు ఉదయం క్లూస్ టీం తో దర్యాప్తు చేపట్టనున్నట్టు తెలియజేశారు.ఆలయంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దేవాలయ అధికారులుఆ కెమెరాలను కోతులు ధ్వంసం జరగడంతో దేవాలయ ప్రాంగణంలో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి.ఆలయంలో గత కొంతకాలంగా అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు కథనాలు వస్తుండగా పోలీసు వారు తగిన భద్రతను ఏర్పాటు చేయాలని స్థానికులు భావిస్తున్నారు.