Subscribe Us

header ads

మందా కృష్ణమాదిగ కు పాలాభిషేకం


  మంజీరగళం ప్రతినిధి :ఉయ్యూరు 

ఎస్సీ రిజర్వేషన్లు ఏ బి సి డి ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేయడం జనాభా ప్రాతిపదికపై దేశంలోకి ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హాజరు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో 6;1 నిష్పత్తిలో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని, అదేవిధంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగిందని ఎం ఈ ఎఫ్ జిల్లా నాయకులు రావెళ్ల. వరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి అతిధులు బంధ సంక్షేమ సేవ మండలి రాష్ట్ర అధ్యక్షుడు పెదపూడి. కాంతారావు హాజరై మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన అనేక ఉద్యమాలు పోరాటాలు త్యాగాల ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా ధర్మం గెలిచిందని ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసి అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తీర్పు వర్గీకరణ అనుకూలంగా పూర్తిగా సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమర్ధించిన అన్ని రాజకీయాలు లక్షల నాయకులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నాయకులు పెద్దలు కోట అంజయ్య,పండు,నాగరాజు,రాజేష్,రాజు,రమేష్, కోటేశ్వరరావు, విక్టర్ పాల్ శివనాగు,ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు