Subscribe Us

header ads

బర్రింకలపాడు వెల్కమ్ పార్టీ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.


(మంజీరాగళం )ప్రతినిధి :జీలుగుమిల్లి.

ఏలూరుజిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఏ పి టి డబ్ల్యూ ఆర్ జూనియర్ కళాశాలలో గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి కాలం లో విద్యార్థులు సెల్లఫోన్ కి బాగా ఎడిక్ట్ అవుతున్నారు వీలైనంత మొబైల్స్ కి దూరంగా ఉంచండి అని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. నేను ఇటువంటి స్కూల్ లోనే చదువుకిని వచ్చాను, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ వారు తిని తినక మీకు ఏ అవసరం ఉంటే వాటిని సమాకురుస్తున్నారు వాటిని గుర్తించుకొని అలాగే గవర్నమెంట్ పరంగా కాలేజ్ కి ఏ అవసరం ఉన్న మన ఎన్డీయే కూటమి ప్రభుత్వం తప్పకుండ చేస్తుంది..చేపిస్తాను, ఇది నా ఊరు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి 100% పాస్ పర్సెంట్ ఉండాలి, అలాగే నేషనల్, స్టేట్ గేమ్స్ లో మన విద్యార్థులు మంచి ప్రతిభ చూపించాలి -దానికోసం నా పర్సనల్ సాకారం కూడా ఉంటుంది అని తెలియజేసారు..అనంతరం మీడియా మిత్రులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమానుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు,మీడియా మిత్రులు పాల్గొన్నారు.