Subscribe Us

header ads

ఆర్ ఆర్ పేటలోని అన్న క్యాంటీన్ ను పరిశీలించిన కూటమి నాయకులు.


 
 (మంజీరాగళం ):ప్రతినిధి ఏలూరు 

ఏలూరుజిల్లా ఏలూరులో అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుంది అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలియజేశారు.ఆర్ ఆర్ పేట లో ఉన్న అన్నకాంటీన్ ను శనివారం ఉదయం ఆయన ఏలూరు జిల్లా ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి పరిశీలించారు.. తొలుత అన్నకాంటీన్ లో అల్పాహారాన్ని స్థానికులకు వడ్డించి స్థానిక ఎంపీ,ఎమ్మెల్యే, స్థానిక నాయకులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అన్ని క్యాంటీన్ పర్యవేక్షణ ఏవిధంగా సాగుతుందో పరిశీలించడానికి ఎంపీ, ఎమ్మెల్యే తో కలిసి ఇక్కడకు వచ్చామని,గత ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటీన్ రీ ఓపెన్ చేసి పేద మధ్యతరగతి ప్రజలకు సకాలంలో ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్ ను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, ఏలూరులో ఈ కార్యక్రమం ఏవిధంగా సాగుతుందో అని పర్యవేక్షణ చేసి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగిందన్నారు.ఈ క్యాంటీన్ లో అంతా సక్రమంగానే సాగుతుందన్నారు. మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వం నుండి ప్రజలు మంచి పరిపాలన ఆశిస్తారు. దానికి ఏమాత్రం తీసిపోకుండా ఏలూరులో నిత్యం ఎంపీ కానీ ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తురన్నారు.. మన ఏలూరు ఎమ్మెల్యే, ఎంపీ ఏలూరు ప్రజల మనసులు గెలుచుకున్నారు.. భవిష్యత్తు లో కూడా ఈ కూటమి ప్రభుత్వం లో గణనీయమైన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు రాబోయే జనరేషన్ కీ అందించాలని ప్రజల మన్ననలు ప్రజల సమస్యల కోసం కూడా ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, నిద్రపోతున్న దుర్మార్గమైన గడిచిన ప్రభుత్వం అనేక రకాల నీచ రాజకీయాలు చేసిందని, ఇప్పటికైనా జగన్ రెడ్డి మీ బుద్ధిని మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పాలకసంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి ఆంజనేయులు, చోడే వెంకట రత్నం, మాగంటి హేమ సుందర్,భీమవరపు సురేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.