Subscribe Us

header ads

సన్ రైస్ ఐఐటీ &నీట్ అకాడమీ నందు పిటిఎల్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక


సన్ రైస్ ఐఐటీ &నీట్ అకాడమీ నందు పిటిఎల్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక 


విజయవాడ /కానూరు, మంజీరగళం ప్రతినిధి :

ఎన్టీఆర్ జిల్లా,  విజయవాడ పట్టణం లో గల కానూరు లో ఉన్న సన్ రైస్ అకాడమీ కార్యాలయంలో   ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల  సమైక్య సర్వసభ్య సమావేశం జరిగినది. ఈ సమావేశంలో  టీచర్స్ మరియు లెక్చరర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నేషనల్ లీడర్ సుబ్బారెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ప్రసన్న,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కే బాబ్జి(కఫీ)రాష్ట్ర కార్యదర్శి టి వీరయ్య, మరియు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... 1994 లో GO NO 1  ప్రభుత్వం  తీసుకొని వచ్చిందని  ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న  ఉపాధ్యాయుల అధ్యాపకులకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు లేదని,  వారు తెలియపరిచారు. ఆర్థికంగా సాంఘిక  సామాజిక ఉద్యోగ భద్రతకు  ఐక్యతగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని  ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ సమావేశంలో పి టి ఎల్ ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా  అధ్యక్షునిగా కరిసే.మధు,వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ ,వెంకట్,అరుణాచలం, జనరల్ సెక్రెటరీ వైవిఎస్ ప్రసాద్,సెక్రటరీ కే.లక్ష్మి, జి.శ్రీనివాసరెడ్డి,ట్రెజరర్ సునీత,ఎగ్జిక్యూటివ్ నెంబర్ రమణారెడ్డి, మరియు గౌరవ అధ్యక్షులు  వీరాంజనేయులునీ  ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.