Subscribe Us

header ads

చల్లపల్లి జ్వర పీడిత విద్యార్థులకు టీచర్లు భరోసాగా ఉండాలి.


చల్లపల్లి
 గ్రామాలలో సీజనల్ వ్యాధులకు గురై జ్వరాల బారిన పడిన నిరుపేద విద్యార్థులకు టీచర్లు చేయూతనిచ్చి భరోసాగా ఉండాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు కోరారు. చల్లపల్లి మండలంలో జ్వరాలు,ఇతర వైరల్ వ్యాధులకు గురైన చిన్నారుల ఇళ్లకు వెళ్లి సురేష్ బాబు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని వాకబు చేసి వారికి ఖర్జూర పండ్లు ఇతర పోషక పదార్థాలు అందజేశారు.ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అందరు విద్యార్థులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన వారే నన్నారు. వైరల్ జ్వరాల బారిన పడిన విద్యార్థులు సరైన పోషకాహారం అందకపోవడం వల్ల తీవ్రంగా సత్తువ కోల్పోయి,నీరసానికి గురవుతున్నారన్నారు.

అనారోగ్యాలకు గురైన విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఆయా విద్యార్థుల కొరకు కొంత సమయం కేటాయించి వారి ఇళ్లకు వెళ్లి ,తల్లిదండ్రులకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి,చిన్నారులకు పోషకాహారం అందించేలా చొరవ తీసుకోవాలని సురేష్ బాబు కోరారు. తద్వారా సమాజంలో ఉపాధ్యాయుల పట్ల మరింత గౌరవం పెరగటంతో పాటు గ్రామస్తులతో సత్సంబంధాలు మెరుగవుతాయన్నారు. ఉపాధ్యాయులు ఈ అంశాన్ని కనీస బాధ్యతగా స్వీకరించాలని మనవి చేశారు.తమ అసోసియేషన్ పక్షాన కూడా సంఘ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బాధిత విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పరామర్శించి పోషకాహారం అందించాలని సురేష్ బాబు పిలుపునిచ్చారు