Subscribe Us

header ads

ఘనంగా మోడల్ స్కూల్ లో ఘనంగా తెలుగు భాషా, క్రీడా దినోత్సవ వేడుకలు….


  (మంజీరగళం ప్రతినిధి ): శ్రీకాకుళం,పాతపట్నం 

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామం లో స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం లను ఘనంగా వేడుకలు నిర్వహించారు.ముందుగా తెలుగు తల్లి, గిడుగు రామమూర్తి పంతులు, మేజర్ ధ్యాన్ చంద్ చిత్ర పటాలకు ప్రిన్సిపాల్ కె. వి రత్నకుమారి ఉపాధ్యాయులు పుష్పాలంకరణ చేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. 
అనంతరం ప్రిన్సిపాల్ రత్నకుమారి మాట్లాడుతూ తెలుగు భాషా గొప్పదనం, క్రీడల యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే క్రీడా దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు లోకేష్ పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృ భాష అయిన తెలుగు భాష చాలా గొప్పది అని దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలుకులను గుర్తుచేసుకున్నారు.వ్యాయామం, క్రీడలు జీవితంలో ఒక భాగం అని ప్రతీ ఒక్కరికీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం నిలకడ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతీ విద్యార్థి క్రీడలను కూడా తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు బి మురళి వందన గీతం తో ముగించారు.అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్పోర్ట్స్ డే ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ టి.హేమసుందర్ రావు, అధ్యాపకులు,విద్యార్థులు కలసి పాల్గున్నారు.