Subscribe Us

header ads

శ్వాసకోస బాధితురాలికి కంబాల శ్రీనివాస రావు ఆర్థిక సాయం

 


(మంజీరగళం ప్రతినిధి ):గోకవరం.

 ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస కోస వ్యాధితో గత రెండు నెలలు నుంచి బాధపడుతున్న గోకవరంలోని మాదిగ పేటకు చెందిన కందుకూరి లక్ష్మికి విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఆదివారం అయన స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.ధైర్యం ఉండాలని తన వంతు సహాయ సహకారం అందిస్తానని కుటుంబ సభ్యులకి,ఆమెకు ధైర్యం చెప్పి,అన్ని విధాల అండగా ఉంటామని,ఆరోగ్యం త్వరలోనే నయమవుతుందని మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కందుకూరి లక్ష్మి కుమారుడు సుధాకర్ తన వద్దకు వచ్చి వల్ల అమ్మ అనారోగ్య పరిస్థితి తనకు తెలపడం జరిగిందన్నారు.తక్షణమే స్పందించి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ తరఫున 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించానన్నారు.కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి తాను ఎల్లప్పుడు ముందుంటానని తెలిపారు. తన వద్దకు సహాయం కోసం వచ్చిన వందలాది మందికి సహాయం అందజేశానని, ముందు ముందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటానని కంబాల శ్రీనివాసరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో గోకవరం గ్రామ పెద్దలు దాసరి తమ్మన్న దొర, విశ్వహింద ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప,తామర్ల రాంబాబు, ఇనకోటి బాపన్న దొర,వరసాల ప్రసాద్,డాక్టర్ వల్లూరి జగన్నాధరావు శర్మ, కట్ట నూకేశ్వర విజయ్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.