(మంజీరగళం ప్రతినిధి)తిరువూరు.
తిరువూరు మండలం, లక్ష్మీపురం గ్రామంలో ఈరోజు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గార్ల ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పించన్ల పంపిణీ కార్యక్రమానికి యన్ టీ ఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఉద్యోగస్థులు ఎడతెరిపి లేని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా* తెల్లవారుజామున నుండే యన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వ ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తున్న లక్ష్మీపురం గ్రామపంచాయతీ ఉద్యోగులను స్థానిక ప్రజలు,నాయకులు అభినందనలు తెలుపుతూ, చంద్రబాబు గారిని,పవన్ కళ్యాణ్ గారిని పెద్గకొడుకులు గా బావిస్తున్నామని పించనుదారులు తెలియజేస్తున్నారు