ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కృషితో మూడో జోన్ కు సాగర్ జలాలు విడుదల చేయించారని జల వనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ తెలియజేశారు.
ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలోని మద్దులపర్వ గ్రామం వద్ద రెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గోగులమూడి రవీందర్ రెడ్డి రెడ్డిగూడెం నాయకులతో కలిసి సాగర్ జలాలను పరిశీలించారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ముద్దులపర్వ లో 5.960 రెగ్యులేటర్ వద్ద సాగర్ జలాలు చేరుకున్నయని తెలిపారు.ప్రస్తుతం 500 క్యూసిక్కులుగా విడుదలైనట్లు మరింత పెంచి నూజివీడు మైలవరం బ్రాంచ్ కెనాల్స్ కు నీరు విడుదల చేసి పంటలను కాపాడే దిశగా మైలవరం శాసనసభ్యులకు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అడుగులు వేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో రైతులతో కలిపి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమినాయకులు,రైతులు పాల్గొన్నారు.