Subscribe Us

header ads

చాట్రాయి గ్రామంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం.. ఈఓపిఆర్డి శివనాగరాజు.


 (మంజీరగళం ప్రతినిధి) చాట్రాయి:-

ఏలూరు జిల్లా మండల కేంద్రమైన చాట్రాయిలో పారిశుధ్య పనులు వేగవంతంగా చురుకుగా సాగుతున్నాయి.ఈఓపిఆర్డి మట్టా శివనాగరాజు ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్రామంలోని మెయిన్ సెంటర్ నుండి ఇరుపక్కల పూడిపోయిన డ్రైనేజీ పూడిక తీయిస్తూ నీరు నిలవకుండా చేస్తున్నా మని శివనాగరాజు తెలిపారు.గ్రమంలో అలానే మండలంలోని అన్ని గ్రామాల్లో విష జ్వారాలు విజ్రృంబించ కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటు న్నట్లు పంచాయితీ కార్యదర్శులకు ప్రసిడెంట్ల తో మాట్లాడి పారిశుద్యం పనులు వేగవంతం చేయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోవిషజ్వరాలు,డెంగ్యూ, మలేరియా, చికిన్ గున్యా వ్యాపించకుండా బ్లీచింగ్ చల్లించడం మరియు ఏ బైట్ స్ప్రే చేయించడం జరిగిందని గ్రామంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్లు ఈఓపిఆర్డి శివనాగరాజు తెలిపారు. గ్రామంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి బజారు లోనూ క్యాంపులు నిర్వ హిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామాల్లో ఇంటి ఆవరణలో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడా లని పరిశుభ్రత పాటిం చాలని, కాచి వడపోసిన నీళ్లను మాత్రమే తాగాలని గ్రామ ప్రజలను నాగరాజు కోరారు.