కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సిఐటి భవనం నందు కామ్రేడ్ వేమూరి చిన్నప్ప సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.సంస్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి సభ్యురాలు శ్రీమతి కే.గంగ భవాని,ఎంపీపీ వై.నగేష్,
విచ్చేశారు.మానవతా రాష్ట్రకార్యదర్శిమారుబోయిన.కోటేశ్వరరావు మాట్లాడుతూ వేమూర్తి చిన్నప్ప మూడు దశాబ్దాలపాటు ఉపాధ్యాయునిగా,విశేష సేవలుఅందించి,యుటిఎఫ్ నిబద్ధత గల నాయకునిగా సంఘ బలోపేతానికి విశేష కృషిచేశారన్నారు.జడ్పిటిసి సభ్యురాలు శ్రీమతి కే.గంగ భవాని మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు అంకితభావంతో విధులు నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలను పొందిన వ్యక్తిగా ఆయన్ని కీర్తించారు.ఎంపీపీ
వై.నగేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి తో పాటు యుటిఎఫ్ లో చురుగ్గా పాల్గొంటూ ఎవరికీ ఏ కష్టం వచ్చినా అక్కడ తాను ఉంటానని సమస్య పరిష్కరించే వరకు పోరాడే వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు.చలమలశెట్టి రమేష్ మాట్లాడుతూ నేటి తరం ఉపాధ్యాయులు
కామ్రేడ్ చినప్ప ఆశయాలని కొనసాగించి ముందుకు సాగాలని తెలిపారు.వేమూర్తి చిన్నప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శిఉమామహేశ్వరరావు,జిల్లాఅధ్యక్షులు బి.కనకరావు,పూర్వ ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి.బాబురావు,
జిల్లా కార్యదర్శి వెలమర్తి.
రవిబాబు,సిపిఐఎం నాయకులు కామ్రేడ్ మహమ్మద్
బారి,అధ్యక్షులు శ్రీమతి పి.జగతి,సహాధ్యక్షులు బి.నాగరాజు,ప్రధాన కార్యదర్శి డి.శ్రీహరి,యం. రమణ గోపాల్,డి.భాస్కర్ రావు,పాల్గొన్నారు.