(మంజీర గళం )ప్రతినిధి :వీరవల్లి
ఆమోదయోగ్యమైన ఎలైన్ మెంట్ పరిశీలనలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులుదక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ- ఏలూరు సెక్షన్ లో తేలప్రోలు-నూజివీడు రైల్వే స్టేషన్ల మధ్యలో ఎల్.సి.నెం.331 రైల్వే మాన్యువల్ గేటు స్థానంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్.ఓ.బి) నిర్మాణానికి గతంలోనే ఫీజుబిలిటీ వచ్చిన నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే ఛీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు నిర్మాణానికి సంబంధించిన రోడ్డు భద్రతా ప్రాజెక్టులు స్కీములో భాగంగా రైల్వే ప్లానింగ్ డిపార్టుమెంటుకు సంబంధిచిన ఇంజనీర్ లు డి.సాయికుమార్, సిహెచ్.శ్రీకాంత్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎ.పి. ట్రాన్స్ కో, ఎన్.హెచ్.ఎ.ఐ, ఆర్ & బి, పంచాయితీరాజ్, రెవిన్యూ, స్థానిక రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులతో ఈరోజు మధ్యాహ్నం వీరవల్లి రైల్వే గేటు దగ్గర సంయుక్త తనిఖీ నిర్వహించి తుది ఎలైన్మెంట్ ఎంపిక త్వరగా పూర్తికావటానికి సలహాలు, సూచనలు సేకరించారు.
ఈ సందర్భంగా రైల్వే ప్లానింగ్ ఇంజనీర్లు మాట్లాడుతూ ఇప్పుడున్న ఆర్ & బి రోడ్డు మీద యధాతథంగా ఒక ఎలైన్మెంట్, రంగన్నగూడెం-కొమ్మూరు రోడ్డు దగ్గరనుంచి ఎడమవైపు శాలివాహన కాలనీమీదుగా వీరవల్లి రెండు చెరువుల జంక్షన్ కు ఒక ఎలైన్మెంట్ రూపొందించటం జరిగిందని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే ఆర్.ఓ.బి నిర్మాణానికి టెండర్లు పిలవటానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ ఆర్.ఓ.బి నిర్మాణానికి మొట్టమొదటినుంచి ఢిల్లీ స్థాయిలో కృషి చేసిన హనుమాన్ షుగర్స్ మాజీ ఛైర్మన్ గుండపనేని ఉమావరప్రసాద్, సాగునీటి వినియోదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు తదితరులు రైల్వే అధికారులతో మాట్లాడుతూ 2018లోనే ఈ ఆర్.ఓ.బి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖనుంచి అప్పటి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబును ఢిల్లీకి తీసుకువెళ్ళి అప్పటి రైల్వే మంత్రి పీయుష్ గోయల్, రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్వినీలోహానీ దృష్టికి తీసుకువెళ్ళి ఫీజుబిలిటీ తీసుకువచ్చామని 2019లో అధికారంలోకి వచ్చిన వై.సి.పి. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం 50 శాతం నిధులు ఇవ్వకపోవటంతో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయిందని, ఎన్.డి.ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి రైల్వే ఉన్నతాధికారులతో చర్చించిన మీదట ఆర్.ఓ.బి నిర్మాణానికి మళ్ళీ అడుగులు పడ్డాయని, ఈ ఉమ్మడి తనిఖీద్వారా వెంటనే ఆమోదయోగ్యమైన ఎలైన్మెంట్ ను ఖరారు చేసి ఆర్.ఓ.బి నిర్మాణానికి టెండర్లు పిలవాలని దక్షిణ మధ్య రైల్వే డి.ఆర్.ఎం కు విజ్ఞప్తి చేశారు. ఈ సంయుక్త స్థల పరిశీలనలో స్థానిక రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీరు వి.రవికుమార్, పి.డబ్ల్యు.ఐ ఎల్.పాండురంగారావు, ఎ.పి.ట్రాన్స్ కో ఇ.ఇ ఎస్.కోటేశ్వరరావు, డి.ఇ.ఇ పి.ఎస్.చిట్టిబాబు, పంచాయితీరాజ్ ఇ.ఇ ఎ.వి.ఎస్. స్వామి, ఆర్ & బి, ఎ.ఇ ఎం.వి.నాగేశ్వరరావు, వివిధ శాఖల ఎ.ఇ లు డి.జయరాజు, మహ్మద్ షకూల్ అహ్మద్, టి.సి.దాసు, వి.ఆర్.ఓ శేఖర్, రైతు ప్రముఖులు కసుకుర్తి అర్జునరావు, మందాడి రవీంద్ర, గుండపనేని సుబ్బారావు, అమృతపల్లి సూర్యనారాయణ, పుసులూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.