Subscribe Us

header ads

ఈనెల 11వ తేదీన కేంద్ర బృందం జిల్లాకు వస్తున్న దృష్ట్యా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు.

 



 మచిలీపట్నం:-

ఈనెల 11వ తేదీన కేంద్ర బృందం జిల్లాకు వస్తున్న దృష్ట్యా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన కేంద్ర అంతర మంత్రిత్వ కమిటీ బృందం జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న వివిధ రకాల పంటలు, ఆక్వా కల్చర్, రహదారులు, వంతెనలు పరిశీలిస్తుందన్నారు. 

ఇందుకోసం బృందం పర్యటించేందుకు రూట్ మ్యాప్ తయారు చేయాలన్నారు. దెబ్బతిన్న పంటలు, రహదారులు, వంతెనలకు సంబంధించి వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ఓ కె చంద్రశేఖర రావు కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి జి శ్రీదేవి,జిల్లా పశుసంవర్ధక మత్స్యశాఖ అధికారులు శ్రీనివాసరావు చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పిడి జి విజయలక్ష్మి, డిఐసి జీఎం వెంకట్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శివప్రసాద్, సిపిఓ గణేష్, వ్యవసాయ శాఖ డిడి మనోహర్ ఎడి మణిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.