Subscribe Us

header ads

సీఎండీ కేఎస్ పీవీ లే అవుట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు


  గోకవరం : 

స్థానిక తంటికొండ రోడ్డు లోని సీఎండీ కేఎస్ పీవీ లే అవుట్ లో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.సీఎండీ కె ఎస్ పి వి లేఅవుట్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ధ మొదటి రోజు రామసేన ట్రెజరర్ మామిడి వీర వెంకట సత్యనారాయణ (అయ్యప్ప ),శ్రీమతి దేవి దంపతులచే అర్చకులు డాక్టర్ వల్లూరు జగన్నాథం శర్మ ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు.రెండోవ రోజు రామసేన సభ్యులు ఇనకోటి బాపన్న దొర, శ్రీమతి సూర్యకాంతం,మూడవ రోజు సోమవారం తామర్ల రాంబాబు శ్రీమతి పద్మ దంపతులచే అర్చకులు పూజ కార్యక్రమం నిర్వహించారు.సీఎండీ కె ఎస్ పి వి లే అవుట్ లోని వినాయకుని మండపనికి చుట్టు పక్కల భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోను వాడ వాడల వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా,సందడిగా జరుగుతున్నాయని అన్నారు. భక్తులు ఎంతో నిష్ట, నియమాలతో వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.అలాగే గ్రామంలోని పలు గణేష్ మండపాలు,వేడుకల ఏర్పాటుకు తమ రామసేన సంస్థ తరఫున సహాయ, సహకారాలు అందించామని తెలిపారు.ఈ కార్యక్రమం లో రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్,సంయుక్త కార్యదర్శి డా వల్లూరి జగన్నాధ రావు శర్మ,మామిడి వీర వెంకట సత్యనారాయణ,కట్ట నూకేశ్వరా విజయ కళ్యాణ్,తొరం తేజ కిరణ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.