కిర్లంపూడి :
అధిక వర్షాలతో ఏలేరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు 10,000 నుండి 20వేల క్యూసెక్కుల నీటిని దిగు ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తామరాడ, రామచంద్రపురం,వీరవరం, రాజుపాలెం,ముక్కొల్లు, గెద్దనా పల్లి,భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగారాయుని పాలెం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మొన్న విజయవాడలో వరదలతో ప్రజలందరూ చాలా ఇబ్బందిగా గురవడం జరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని
ముఖ్యమంత్రి చంద్రబాబు అది సాలతోఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ముంపుకు గురయ్యే అయ్యే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలని వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ప్రాణనష్టం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో తోట నవీన్, కోర్పు సాయి తేజ,తోట గాంధీ,అనుకుల శ్రీకాంత్, వీరం రెడ్డి కాశి బాబు,తూము కుమార్,నీలం శ్రీను,జ్యోతుల రాంబాబు,గంధం ఈశ్వరరావు,గోడె దొరబాబు, గుడేబాల,కరణం బోరయ్య, బొజ్జపు శ్రీను,పట్టు చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.