Subscribe Us

header ads

జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో హీల్ విద్యార్థుల ప్రతిభ


 ఆగిరిపల్లి

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో గల హీల్ పాఠశాల విద్యార్థులు ఏలూరు జిల్లా యోగాసన భారత్ తరపున, ఏలూరు అగ్రహారం లోని సీతారామ భారతీయకల్యాణమండపం లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో హీల్ పారడైజ్ విద్యార్థినీ విద్యార్థులు ఎనిమిది బంగారు,మూడు రజిత, మూడు కాంశ్య పతకాలు సాధించారు.పథకాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకుడు బి.సాయిబాబుమాట్లాడుతూ హీల్ స్కూల్ తరపున పదకొండు మంది బాలికలు,ఐదుగురు బాలురు ఈ పోటీల్లో పాల్గొనగా పదకొండు మందివిద్యార్దినీ విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఎంపికైనట్లుతెలిపారు.

పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.నిరంతర యోగ సాధనతో ఆరోగ్యం బాగుంటుందని ప్రస్తుతం యోగాను కేంద్ర ప్రభుత్వం క్రీడగాగుర్తించిందనిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హీల్ కార్యదర్శి శ్రీమతి.తాతినేని లక్ష్మి,సి.ఈ.ఓకూరపాటి.అజయ్ కుమార్,ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు పి. నాగరాజు,సిహెచ్ ప్రభుదాసు,ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.