Subscribe Us

header ads

కొత్తపల్లి 1,కామరాజుపేట2 గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం


 గోకవరం:


రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వ్యవసాయ పద్ధతులపై పొలం పిలుస్తుంది కార్యక్రమాలు మొదలైనది. గోకవరం మండలంలోని ప్రతి రెండేసి గ్రామములో చొప్పున రైతులకు,వ్యవసాయ శాఖ అధికారులు పి రాజరాజేశ్వరి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలో కొత్త పల్లి 1, కామరాజుపేట 2,గ్రామాలలో బుధవారం పోలం పిలుస్తుంది అవగాహన కార్యక్రమాలునిర్వహించారు.కొత్తపల్లిలో వైస్ సర్పంచ్ కాటం రాజు మరియు కామ రాజుపేట 2 గ్రామం లో సర్పంచ్ అడపా వెంకట్రావు అధ్యక్షతన పొలం పిలుస్తోంది కార్య క్రమం జరిగింది.మండల వ్యవసాయ అధికారి రాజేశ్వరి మాట్లాడుతూ,వ్యవసాయం వ్యవసాయం పంట తక్కువ ఖర్చుతో పంట ఎక్కువ దిగుబడులు ఇచ్చేలా సూచనలు ఇస్తూ,ప్రస్తుతం వాతావరణ మార్పులు వల్ల, వర్షాల వల్ల వచ్చిన వరి ఆకు ఎండు తెగులు సోకినా పంటకు నివారణ చర్యలు యాజమాన్యం పద్ధతులపై వివరించారు.రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం జరిగింది.పురుగు మందుల పిచికారి లలో డ్రోన్ పరికరం పద్ధతులపై పిచికారి ఎలా చేయాలో వివరించారు.నాణ్యమైన ఎరువులు ఎలా వినియోగించు కోవాలో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.అనంతరం రైతులు స్ప్రేయర్స్, టార్ప్ లిన్ సబ్సిడీ మీద ఇప్పించాల్సింది గా కోరారు.ఉద్యాన వన అధికారి మాట్లాడుతూ,ఆయిల్ పామ్ పంట లో మొక్కలు 100% రాయితీ మీద ఇస్తున్నట్టు మరియు 4 సంవత్సరాలు కు ఎరువులు సబ్సిడీ పై ఇస్తున్నామని తెలియచేశారు. రైతులు,వ్యవసాయ సహాయకులు,ఉద్యాన వన సహాయకులు,సర్పంచ్, ఎంపీటీసీ,కూటమి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.