గోకవరం:
మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పై సామాజిక తనిఖీ, ప్రజా వేదిక గోకవరం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఎం పి పి.సుంకర శ్రీవల్లి, జడ్ పి టి సి.దాసరి శ్రీ రంగా రమేష్ అధ్యక్షతన జరిగింది.ప్రజా వేదికకు సహాయ పథక సంచాలకులు,డ్వామా ప్రిసైడింగ్ అధికారి బి.రాంప్రసాద్ పాల్గొన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పనులు పై సామాజిక తనిఖీ,ఈ పథకంలో1-4-2023నుండి 31-3-2024మధ్య కలంలో చేపట్టిన అన్ని రకముల పనులు ఎన్ ఆర్ ఈ జి ఎస్ అను బంధ శాఖల ద్వారా చేపట్టిన సి సి రోడ్డు,సి సి డ్రైన్లు,మినీ గోకులం, పంచాయితీ బిల్డింగ్ లు, పనులు పై సామాజిక తనిఖీ, ప్రజా వేదిక.ఈ సామాజిక తనిఖీ నందు కొట్టి వేత లు,దిద్దు బాట్టు పై జరిమానా రూ -14,500, కొలతల లో వ్యత్యసాన్ని గానూ జరిమానా రూ -28,600,మొక్కలు పెంపకం లో వేసిన మొక్కలు సర్వైవల్ తక్కువ గా ఉండటం, చెరువు గట్టు పై సెక్షనింగ్ సక్రమంగా చేయకపోవడం వలన జరిమానా రూ -62, 450లు.లు బినామీ మస్టర్లురికవరీ 58,320రూ లు. మినీ గోకులం రికవరీ రూ -64,258/-పంచాయితీ రాజ్ పనులు లైనా బిల్డింగ్ లు సి సి రోడ్డు నందు వ్యత్యసాన్ని గానూ రూ -1,58, 225.వంటి అంశాలను గుర్తించి నట్లు ఎస్ ఆర్ పి తులసి నాయక్ తెలియ పరిచారు.ఈ ప్రజా వేదికకు అంబుడ్స్ పర్సన్ ఎస్.ఖాదర్ భాషా,ఏపీ వో అప్పలరాజు,ఇంజనీర్ అధికారి అబ్బాయి దొర,హెచ్ ఆర్.మేనేజర్.నరేష్, సర్పంచులు,ప్రజాప్రతినిధులు, ఎం పి టి సి లు,ఉపాధి వేతన దారులు పాల్గొన్నారు.